12వ రోజుకు కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-17T04:33:45+05:30 IST

కొవిడ్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం ఈనెల 5 నుంచి అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆదివారానికి 12వ రోజుకు చేరుకుంది.

12వ రోజుకు కర్ఫ్యూ
నిర్మానుష్యంగా ఉన్న పాతబస్టాండు

16 జీడీఆర్‌ 2: నిర్మానుష్యంగా ఉన్న పాతబస్టాండు

గూడూరురూరల్‌, మే 16: కొవిడ్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం ఈనెల 5 నుంచి అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆదివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. 12గంటల అనంతరం మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధించడంతో అన్ని దుకాణాలను మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను నిలిపివేయడంతో ప్రధాన రహదారులు జనసంచారం లేకుండా బోసిపోతున్నాయి. రోడ్లుపై ఎవరు అనవసరంగా తిరగకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2021-05-17T04:33:45+05:30 IST