ఆ 8 నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ABN , First Publish Date - 2021-07-17T07:49:17+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను అనేక రాష్ట్రాలు అంచెలంచెలుగా సడలిస్తున్న విషయం తెలిసిందే. అయితే కోవిడ్ ప్రభావం ఇంకా ..

ఆ 8 నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకంటే..

గాంధీనగర్: కరోనా ఉధృతి నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను అనేక రాష్ట్రాలు అంచెలంచెలుగా సడలిస్తున్న విషయం తెలిసిందే. అయితే కోవిడ్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం కూడా కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 8 జిల్లాలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అహ్మదాబాద్, జూనాగఢ్, వడోదర, రాజ్‌కోట్, సూరత్, భావ్‌నగర్, జామ్‌నగర్, గాంధీనగర్ నగరాల్లో ఈ నైట్ కర్ఫ్యూ కొనసాగించనున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ కర్ఫ్యూ ఆగస్టు 1 ఉదయం వరకు అమలులో ఉంటుందని తెలిపింది. అలాగే మునుపటి నిబంధనల ప్రకారమే.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని వెల్లడించింది. అయితే వాటర్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో జూలై 20 నుంచి తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. 

Updated Date - 2021-07-17T07:49:17+05:30 IST