కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-12T05:44:32+05:30 IST

కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుటామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ
నందికొట్కూరులో వాహనదారులను మందలిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

నందికొట్కూరు, మే 11: కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుటామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. నందికొట్కూరు పట్టణంలో మంగళవారం కర్ఫ్యూ అమలు పరిశీలించారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ఆపి మందలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ రెండు వారాలపాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు.  


బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో మంగళవారం కర్ప్యూ కొనసా గింది. దీంతో  పట్టణంలోని అన్ని ప్రధాన వీధులు  నిర్మానుష్యంగా మారిపోయాయి. సీఐ సురేశ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ మహేశ్‌కుమార్‌, ట్రైనీ ఎస్‌ఐ మునిప్రతా్‌పల ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది  పట్టణంలో కర్ప్యూను పర్యవేక్షించారు.  వ్యాపారులు మధ్యాహ్నం 12గంటల తర్వాత  దుకాణాలను మూసివేశారు. పోలీస్‌ సిబ్బంది వాహనాల్లో తిరుగుతూ  వ్యాపార సంస్థలను మూసివేసి ప్రధాన కూడళ్లలో బందోబస్తును పర్యవేక్షించారు.   జీఎం  టాకీస్‌, పాత బస్టాండ్‌, స్ట్టేట్‌బ్యాంక్‌ రోడ్డు,  ఆస్థానం రోడ్డు,  కొత్తబస్టాండ్‌, పెట్రోల్‌బంకు,  అవుకు  కూడలి  జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి.  ఆర్టీసీ బస్సు లు 12 గంటల తర్వాత డిపోలకు పరిమితమయ్యాయి.   పట్టణంలో 144 సెక్షన్‌ అమలు  చేశారు.  


కోవెలకుంట్ల: కరోనా కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు పేర్కొన్నారు. మంగళవారం పగటి కర్ఫ్యూ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, మౌలాని, సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. మఽధ్యాహ్నం 12 గంటల తరువాత రోడ్డపైకి వచ్చిన వాహనాల యజమానులకు జరిమానా  విధించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.   రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు వ్యాపార లావాదేవీలు పూర్తి అయిన తరువాత మధ్యాహ్నం 12 గంటల తరువాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తోందన్నారు.


సంజామల: కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే  చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర సంజామల పోలీసులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రమైన సంజామలలో కర్ఫ్యూను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ తిమ్మారెడ్డితో ఆయన మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  


Updated Date - 2021-05-12T05:44:32+05:30 IST