హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు అనవసరంగా ఆసుపత్రుల చుట్టూ తిరగడాన్ని నివారించేందుకు హైదరబాద్‌కు చెందిన క్యురిడాక్ ఉచిత కన్సల్టింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా సమగ్ర హెల్త్‌కేర్ ప్రణాళికను ఉచితంగా పొందవచ్చని వ్యవస్థాపకులు ప్రహ్లాద్ రెడ్డి తెలిపారు. టీ హబ్‌లోని క్యురిడాక్‌ను తెలంగాణ ఐటీ మంత్రి కే తారక రామారావు సందర్శించి స్టార్ట్‌పనకు కావాల్సిన పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రైమరీ ట్రీట్‌మెంట్ ప్రణాళికను పొందడానికి యాప్ ఉపయోగపడుతుంది.