పబ్‌లో నోట్ల దండలు!

ABN , First Publish Date - 2021-06-11T05:30:00+05:30 IST

ఆ పబ్‌లో అడుగుపెడితే సీలింగ్‌ మొత్తం నోట్లతో కనిపిస్తుంది. ఎటు వైపు చూసినా వేలాడదీసిన డాలర్లు కనిపిస్తాయి. ఇంతకీ పబ్‌లో నోట్లను ఎందుకు వేలాడదీశారు? ఆ పబ్‌ ఎక్కడుంది? ఆ విశేషాలు ఇవి...

పబ్‌లో నోట్ల దండలు!

ఆ పబ్‌లో అడుగుపెడితే సీలింగ్‌ మొత్తం నోట్లతో కనిపిస్తుంది. ఎటు వైపు చూసినా వేలాడదీసిన డాలర్లు కనిపిస్తాయి. ఇంతకీ పబ్‌లో నోట్లను ఎందుకు వేలాడదీశారు? ఆ పబ్‌ ఎక్కడుంది? ఆ విశేషాలు ఇవి...


  1. రెస్టారెంట్‌లో టిప్‌ ఇస్తే వెయిటర్‌ సంతోషంగా జేబులో వేసుకుంటాడు. కానీ ఆ పబ్‌లో మాత్రం ఎవరైనా టిప్‌ ఇస్తే సీలింగ్‌కు ఆ నోటును అంటిస్తారు. అలా వేలాడదీసిన డబ్బు ఇప్పుడు ఎంతయిందో తెలుసా? మన కరెన్సీలో అక్షరాలా రూ. 14 కోట్లు.
  2. ఫ్లోరిడాలోని పెన్సాకోలాలో మెక్‌ గుయిర్‌ ఐరిష్‌ పబ్‌ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఈ పబ్‌లో నోట్లు వేలాడదీసే సంప్రదాయం ఎలా మొదలయిందంటే... 1977లో మార్టిన్‌ మెక్‌గుయిర్‌, అతని భార్య మోలీ ఈ పబ్‌ను ప్రారంభించారు. మొదటి కస్టమర్‌ ఒక డాలర్‌ను మోలీకి టిప్‌గా అందించాడు.
  3. ఆమె ఆ టిప్‌పై తేదీని రాసి జ్ఞాపకంగా ఉంచుకునేందుకు సీలింగ్‌కు ఒక చోట అంటించింది. ఆ తరువాత రోజు నుంచి వచ్చిన కస్టమర్లు ఆ విషయాన్ని తెలుసుకుని, తమ టిప్‌లను సీలింగ్‌కు అంటించడం మొదలుపెట్టారు. అలా ఇప్పటి వరకు అంటించిన నోట్ల విలువ రూ.14 కోట్ల పైనే ఉంటుందని అంటారు పబ్‌ యజమాని మెక్‌ గుయిర్‌.

Updated Date - 2021-06-11T05:30:00+05:30 IST