విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

ABN , First Publish Date - 2021-04-09T05:59:57+05:30 IST

విద్యుదాఘాతంతో ఓ రైతు తనపొలంలోనే మృత్యువాత పడిన సంఘటన మండలంలోని కళ్యాణపురంలో గురువారం చోటు చేసుకుంది.

విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

 పొదలకూరు(రూరల్‌); ఏప్రిల్‌ 8 : విద్యుదాఘాతంతో ఓ రైతు తనపొలంలోనే మృత్యువాత పడిన సంఘటన మండలంలోని కళ్యాణపురంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కధనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అక్కెం వేణుగోపాల్‌రెడ్డి (46) తన నిమ్మతోటలో చెట్లకు నీళ్లు పెట్టడానికి మోటారు ఆన్‌ చేస్తుండగా ప్రమాదవ శాత్తు విద్యుత్‌ షాక్‌కుగురై అక్కడికక్కడే మృతి చెందాడు. పరిషత్‌ ఎన్నికలలో ఓటుహక్కును వినియోగించుకొని ఎండలోనే తోటలోకి వెళ్లి ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరవుతున్నారు. మృతునికి భార్య, కమార్తె ఉన్నారు. 


కాటేపల్లి తీరంలో యువకుడి మృతదేహం

తోటపల్లిగూడూరు, ఏప్రిల్‌ 8 :  మండలంలోని మండపం పంచాయతీ కాటేపల్లి సముద్రతీరంలో గురువారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఈదూరు గ్రామానికి చెందిన వాసా వెంకటేశ్వర్లు (38)  కాటేపల్లి తీరంలో సముద్రంలో మునుగుతూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. దీంతో సముద్రంలో కొట్టుకుపోయిన కొద్దిసేపటికే అతని మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. మృతి చెందిన వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు బిడ్డలున్నట్లు తెలిసింది. ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి  తరలించి,  కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా వెంకటేశ్వర్లు కాటేపల్లి బీచ్‌కు ఒంటరిగా ఎందుకు వెళ్లాడన్నది సందిగ్ధంగా మారింది. వెంకటేశ్వర్లుది ఆత్మహత్య...? లేదా ప్రమాదమా అనే కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. 

 

Updated Date - 2021-04-09T05:59:57+05:30 IST