Abn logo
Sep 19 2021 @ 07:41AM

విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ మృతి

వేలూరు(చెన్నై): ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తున్న సమయంలో హైఓల్టేజీ విద్యుత్‌ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై లైన్‌మెన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తిరుపత్తూర్‌ జిల్లా భానావరం సమీపం మాసానిమేట్టు గ్రామానికి చెందిన కుమరేశన్‌ (45) భానా వరం ఉప విద్యుత్‌ కేంద్రంలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం భానావరం పరి సర ప్రాంతాల్లో విద్యుత్‌ మార్గాల మరమ్మతుపనులు చేపట్టారు. కోడంబాక్కం సమీపంలో కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ వెనుక భాగంలో ఉన్న ట్రాన్స్‌పార్మర్‌ ఎక్కి కుమరేశన్‌ మరమ్మతుపనులు చేపట్టాడు. అతను ఊహించని రీతిలో ట్రాన్స్‌ఫార్మర్‌పై నుంచి వెళుతున్న హై ఓల్టేజీ విద్యుత్‌ తీగకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై సంఘటనాస్థలంలోనే మృతచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరక్కోణం ప్రభుత్వాస్పత్రికి తరలించిన భానావరం పోలీసులు, ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతుడు కుమరేశన్‌కు ధనలక్ష్మి అనే భార్య, 18 ఏళ్ల కుమారుడు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు.


క్రైమ్ మరిన్ని...