Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన్‌తో పోరాడేందుకు కొత్త టీకాలు కావాలి: మోడర్నా సీఈఓ వ్యాఖ్య

వాషింగ్టన్: కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌‌ను ప్రస్తుతమున్న టీకాలు పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోవచ్చని  ప్రముఖ బయోటెక్ సంస్థ మోడర్నా అధిపతి స్టిఫానే బాన్సెల్ మంగళవారం నాడు హెచ్చరించారు. కొత్త టీకాల అవసరం ఏర్పడవచ్చని అభిప్రాయపడ్డారు. మరో రెండు వారాల్లో కొత్త వైరస్‌పై ప్రస్తుత టీకాల సామర్థ్యం ఎంతో తెలిసిపోతుందని  చెప్పారు. అయితే..శాస్త్రవేత్తలు మాత్రం ఈ ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయని తనతో చెప్పినట్టు కూడా పేర్కొన్నారు.  కాగా.. మోడర్నా, ఫైజర్, స్పూత్నిక్-వీ రూపకర్తలు తాము ఒమైక్రాన్‌కు చెక్ పెట్టే టీకా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే ప్రకటించాయి. ఇక కొత్త వేరియంట్ విషయంలో చైనా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఒమైక్రాన్ కారణంగా వింటర్ ఒలింపిక్స్ నిర్వహణలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక.. ఒమైక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలకు తెరలేపిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement