Abn logo
Sep 27 2021 @ 00:09AM

నాక్‌ దృష్టికి బోధనాంశాలు

మాట్లాడుతున్న వీసీ వెంకటరావు

  వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు 

ఎచ్చెర్ల, సెప్టెంబరు 26: డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ యూనివర్సిటీని ఈ నెల 28, 29, 30 తేదీల్లో సం దర్శించనున్న నాక్‌ బృందా నికి వర్సిటీ తరఫున బోధన, పరిశోధన, పరిపాలన అంశా లను సమర్థవంతంగా వివ రించాలని వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు. నాక్‌ సందర్శన దృష్ట్యా ఆదివారం వర్సిటీలో డీన్‌లు, విభాగాధిపతులు, కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీ ద్వారా చేపడుతున్న సామాజిక కార్యక్రమాలతో పాటు, వర్సిటీ ప్రగతిని నాక్‌ బృందానికి స్పష్టంగా వివరించాల్సి ఉందన్నారు. వర్సిటీలో డిపార్ట్‌మెంట్ల వారీగా బోధనా సిబ్బంది ప్రచురించిన పరిశోధనా పత్రాలు, అకడమిక్‌ సంబంధించిన విజయాలను నాక్‌ బృందం ముందు ప్రదర్శించాలన్నారు. వర్సిటీలో అన్ని విభాగాలు పరిశుభ్రం చేసి, సుందరంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌  తమ్మినేని కామరాజు, వర్సిటీ ప్రిన్సిపాళ్లు బిడ్డిక అడ్డయ్య,  పీలా సుజాత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌  స్వప్న వాహిని, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌  ఎం.అనూరాధ, నోడల్‌ అధికారి  హనుమంతు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.