Abn logo

కరివేపాకు చట్నీ

కావలసినవి: కరివేపాకు - ఒక కప్పు, కొబ్బరి తురుము - ఒక కప్పు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, జీలకర్ర - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, అల్లం - చిన్నముక్క, చింతపండు - నిమ్మకాయంత, వేరుశనగలు - రెండు టేబుల్‌స్పూన్లు ్ల(వేగించినవి), కరివేపాకు - కొద్దిగా (పోపుకోసం).


తయారీ విధానం: స్టవ్‌పై కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. కరివేపాకు క్రిస్ప్‌గా అయ్యే వరకు వేగించుకుని దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీ జార్‌లో వేసి, కొబ్బరితురుము, చింతపండు, వేరుశనగలు, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగించాలి. ఈ పోపుని చట్నీలో కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి. 

సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌మేథీ బాజీకరివేపాకు కర్రీచోలే రాజ్మా కర్రీసోయా బీన్‌ ఆలూ కూర్మాకీటో బటర్‌ పనీర్‌ మునగకాయ థోరన్‌cauliflower కర్రీపనీర్‌ కోఫ్తే కా సలాన్‌షాహీ పనీర్‌
Advertisement