సరదా శాపం..

ABN , First Publish Date - 2022-03-18T05:11:04+05:30 IST

నేటి తరం పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో సరదా కోసం ఈతకు వెళ్లిన పిల్లలు మృత్యువాత పడుతున్నారు.

సరదా శాపం..
వనపర్తిలోని ఓ బావిలో ఈత కొడుతున్న విద్యార్థులు (ఫైల్‌)

- ఈత నేర్చుకోవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న  చిన్నారులు

- రక్షణ చర్యలు, పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమంటున్న నిపుణులు

- చెరువులు, కుంటల వద్ద నీరటిల వ్యవస్థను పునరుద్ధరిస్తే మేలు

- ఉరుకులు, పరుగుల జీవితంతో పిల్లలపై  దృష్టిపెట్టని తల్లిదండ్రులు

- ప్రమాదం జరిగితే ఈత వచ్చిన వారూ చనిపోతున్న దుస్థితి

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న నీట మునిగిన మరణాలు

 నేటి తరం పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో సరదా కోసం ఈతకు వెళ్లిన పిల్లలు మృత్యువాత పడుతున్నారు.  చెరువులు, కుంటలు, జలాశయాల వద్ద సరైన రక్షణ చర్యలు లేవు..   మిత్రులతో కలిసి చెరువుల్లోకి దిగుతుండటం, ఊబిలు ఎక్కడుంటాయి.. బురద ఎక్కడుంటుంది..  రాళ్లు ఎక్కడుంటాయో తెలియక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  గతంలో చెరువులు, కుంటల వద్ద ఉన్న నీరడీలు  చెరువు పర్యవేక్షణ బాధ్యతలు చూసుకునేవారు.. ఎవరైనా ఈతకు వస్తే వారిని మందలించి  పంపించేవారు.. కానీ ప్రస్తుతం అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా నీట మునిగి మృత్యువాత పడుతున్నారు.

వనపర్తి, మార్చి 17,(ఆంధ్రజ్యోతి) : అత్మరక్షణతో పాటు, శారీరక వ్యాయామానికి ఎంతగానో ఉపయోగప డే ఈత ప్రాణాలను హరిస్తోంది. నీటి వనరుల లభ్యత పెరిగిన తర్వాత  సరదా కోసమని ఈతకు వెళ్లి మృత్యు వాత పడుతున్న దుర్గటనలు అధికంగా చోటుచేసుకుం టున్నాయి. ప్రధానంగా తమ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎటు వెళ్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు సరైన శ్రద్ధ చూపించకపోవడంతో విద్యార్థులు ఇలాంటి ప్రమా దాల బారిన పడుతున్నారు. చెరువులు, కుంటలు, జలా శయాల వద్ద సరైన రక్షణ చర్యలు  ఉండవు.. కానీ ఒక రిద్దరు ఈత వచ్చిన మిత్రులతో వెళ్తున్న విద్యార్థులు.. తమ ప్రాణాలతో పాటు ఈత వచ్చిన వారి ప్రాణాలను కూడా బలిగొంటున్నారు.  గతంలో పిల్లలు ఈతకు వెళ్లి నా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేది.. బెండు సాయం తో ఈత నేర్పించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో తల్లిదం డ్రుల ఉరుకులు, పరుగుల జీవితంతో విద్యార్థులకు దగ్గరుండి నేర్పించాల్సిన అనేక అంశాలను  పట్టించుకో వడం లేదు. దీంతో మిత్రులతో కలిసివెళ్తున్న వారు..  చెరువుల్లోకి దిగుతుండటం, ఊబిలు ఎక్కడుంటాయి.. బురద ఎక్కడుంటుంది..  రాళ్లు ఎక్కడుంటాయో తెలియక పోవడం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా యి.  చెరువులు, కుంటల్లో ఈత నేర్చుకోవద్దని పోలీసు లు, అధికారులు పదేపదే చెబుతున్నా.. విద్యార్థుల అవగాహన రాహిత్యంతో ప్రమాదాలు సంభవిస్తున్నా యి. గతంలో చెరువులు, కుంటల వద్ద నీరడీలు ఉండేవారు.. వారు చెరువు పర్యవేక్షణ బాధ్యతలు చూసుకునేవారు.. ఎవరైనా ఈతకు వస్తే వారిని మందలించి  పంపించేవారు.. కానీ ప్రస్తుతం అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా చెరువుల వద్ద పర్యవేక్షణ లేకుండా పోయింది. 

రక్షణ చర్యలు కరువు

ఈత నేర్చుకునే విద్యార్థులు చెరువులు, కుంటలు, బావుల వద్దకు కాకుండా స్విమ్మింగ్‌ పూల్స్‌లలోనే నేర్చుకోవాలి.. లోతు తక్కువగా ఉండ టం.. పర్యవేక్షకులు అందుబాటులో ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉండడదు.  ఈత నేర్చుకోవాలనుకునే వారు మొదట్లో నీటిలో తేలియాడే పరికరాలు  ఉపయోగించి నేర్చుకోవాలి.   

మరణాలు అనేకం 

 ఈతకు వెళ్లి మరణాలు సంభవించడంతో పాటు ఆత్మహత్యలు, ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, కుంటలు, జలాశయాలు కలిపి 5400 పైచిలుకు ఉన్నాయి. వీటిల్లో వనపర్తి జిల్లా లో ఈతకు వెళ్లి ఇప్పటివరకు 11 మంది మృతి చెందా రు. అలాగే వివిధ కారణాలతో నీటి మునిగి మరణిం చిన వారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు కలిపి 51 మంది ఉంటారు. గద్వాల జిల్లాలో ఈతకు వెళ్లి మృతి చెందిన వారు లేరు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రధా నంగా కోయిల్‌సాగర్‌ జలాశయంలో చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపో వడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతేడాది చివర ఒకరు మృతిచెందగా.. కోయిల్‌సాగర్‌కు వద్ద పార్టీలు చేసుకు నేందుకు వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందుతున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాకేంద్రంలో కూడా నాలుగు నెలల కిత్రం ఒకరు చనిపోయారు. జనవరిలో పాలకొండలో ఒకరు చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. నాగర్‌క ర్నూలు జిల్లాలో గడిచిన రెండు నెలల వ్యవధిలో ఈత కు వెళ్లి ముగ్గురు చనిపోయారు. ప్రధానంగా చెరువు లు, కుంటలు, జలాశయాల వద్ద  వద్ద నీరటిలు, కాలు వల వెంట లష్కర్ల పర్యవేక్షణ ఉండేది. కానీ ఇప్పుడు లష్కర్లు, నీరడీలు లేరు. సీఎం కేసీఆర్‌ వీఆర్‌ ఏలను నీరడీలుగా నియమిస్తామని ఇటీవల ప్రకటిం చారు. ఆ వ్యవస్థను తిరిగి పునరిద్ధరిస్తే  జలాశయాల వద్ద జరిగే  ప్రమాదాలను అరికట్టవచ్చు.





Updated Date - 2022-03-18T05:11:04+05:30 IST