Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిధులొచ్చాయ్‌..

- స్థానిక సంస్థలకు ఊరట

- జిల్లాకు రూ.4.92 కోట్ల నిధులు  

- జిల్లా పరిషత్‌కు రూ.2.48 కోట్లు, 

- మండలాలకు రూ.2.44 కోట్లు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నిధులు ఎప్పుడొస్తాయోనని ఎదురు చూసిన స్థానిక సంస్థల ప్రతినిధులకు ఊరట లభించింది. స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఎట్టకేలకు నిధులను విడుదల చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌తోపాటు 12 మండల పరిషత్‌లకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాకు రూ.4.92 కోట్ల నిధులు వచ్చాయి. ఇందులో జిల్లా పరిషత్‌కు రూ.2.48 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.2.44 కోట్ల నిధులు ఉన్నాయి. ఇందులో సాధారణ నిధులు ప్రజల మౌలిక సదుపాయాలకు వినియోగించుకోనుండగా ఎస్సీ, ఎస్టీ, స్లాబ్‌ ప్లాన్‌ కింద విడుదలైన నిధులు అయా కాలనీల్లోని సీసీ రోడ్లు, అండర్‌ డ్రైనేజీలు, పాఠశాలల అదనపు తరగతి గదులకు ఉపయోగించనున్నారు. పరిషత్‌కు విడుదలైన నిధులను ఖర్చు చేసే విధంగా నిర్ధిష్ట మార్గదర్శకాలు కూడా జారీ చేశారు.

 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతోనే కదలిక

2019 ఎన్నికల్లో గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు నిధులు లేకపోవడంతో నిరాశ చెందారు. అనేక సార్లు ముఖ్యమంత్రి, మంత్రులను నిధులకోసం విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2021 - 22 బడ్జెట్‌లో జిల్లా పరిషత్‌లకు రూ.250 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.248 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం రూ.250 కోట్లు విడుదల చేశారు.  నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో ప్రజాప్రతినిధుల్లో అయోమయం నెలకొన్న క్రమంలో కరీంనగర్‌ స్థానిక సంస్థల  ఎన్నికలు ఈ నెల 10న ఉండగా ప్రభుత్వం నిదులు విడుదల చేయడంపై  చర్చ సాగుతోంది.  చర్చ ఎలా ఉన్నా బడ్జెట్‌కు సంబంధించిన నిధులు విడుదల కావడం జిల్లా పరిషత్‌లకు ఊరట ఇచ్చింది. జిల్లాకు మంజూరైన రూ.4.92 కోట్లలో జిల్లా పరిషత్‌కు రూ.2.48 కోట్లు ఉన్నాయి. ఇందులో సాధారణ నిధులు రూ.1.94 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.45 లక్షలు, ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.9 లక్షలు ఉండగా మండల పరిషత్‌లకు కేటాయించిన నిధుల్లో సాధారణ నిధులు రూ.1.91 కోట్లు, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.44 లక్షలు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.9 లక్షలు ఉన్నాయి. గ్రామాల్లో నిఽధులతో అభివృద్ధి పనులు జరగనున్నాయి. 


Advertisement
Advertisement