26లోగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-02-25T04:42:37+05:30 IST

కస్టమ్‌ మిల్లింగ్‌రైస్‌ను ఈ నెల 26లోగా పూర్తి చే యాలని కలెక్టర్‌ శరత్‌ రైస్‌మిల్లర్లను ఆదేశించారు.

26లోగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ పూర్తి చేయాలి
అధికారులు, రైస్‌మిల్లు యాజమాన్యాలతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కామారెడ్డిటౌన్‌, ఫిబ్రవరి 24: కస్టమ్‌ మిల్లింగ్‌రైస్‌ను ఈ నెల 26లోగా పూర్తి చే యాలని కలెక్టర్‌ శరత్‌ రైస్‌మిల్లర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సీఎంఆర్‌ఎప్‌పై సమీక్షించారు. ఇంకా పదివేల మెట్రిక్‌ టన్నులు మిగిలి ఉందని, వాటిని ఎఫ్‌సీఐకి అందజేయాలని సూచించారు. అనంతరం జిల్లాలో ధాన్యం కొ నుగొలు కేంద్రాల పరిస్థితిపై ఆరాతీశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విపత్తులశా ఖ ద్వారా ప్రచురితమైన పిడుగుపాటు, సంకేతాలు, పడే ప్రదేశాలు, ఆ సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన టీఎస్‌వేదర్‌ మొబైల్‌ యాప్‌ పోస్టర్‌ను బుధవారం కలెక్టర్‌ శరత్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌, డీఎం సివిల్‌ సప్లయ్స్‌ జితేంద్రప్రసాద్‌, జిల్లా పౌర సరాఫరాల అధికారి కొండల్‌రావు, జిల్లా వ్యవసాయధికారి భాగ్యలక్ష్మీ, జిల్లామార్కెటింగ్‌ అధికారి రమ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T04:42:37+05:30 IST