కొత్త సేవలతో జియోకు కస్టమర్ల వెల్లువ

ABN , First Publish Date - 2021-04-03T06:18:22+05:30 IST

జియో అనుసరిస్తున్న దూకుడు వ్యూహం, కొత్త ఆఫర్లు, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు త్వరలో ప్రవేశపెట్టడం

కొత్త సేవలతో జియోకు కస్టమర్ల వెల్లువ

న్యూఢిల్లీ: జియో అనుసరిస్తున్న దూకుడు వ్యూహం, కొత్త ఆఫర్లు, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు త్వరలో ప్రవేశపెట్టడం వంటివి గతంలో కోల్పోయిన కస్టమర్లను తిరిగి సంపాదించేందుకు, కస్టమర్ల సంఖ్య పెరిగేందుకు దోహదపడతాయని జేఎం ఫైనాన్షియల్‌ తాజా నివేదికలో తెలిపింది. ఇటీవల కాలంలో టారి్‌ఫల పెంపు ఒక్కో వినియోగదారుని పైన సగటు ఆదాయం (ఆర్పు) పెరుగుదలను దెబ్బ తీయవని, రాబోయే కాలంలో ఏ మాత్రం కన్సాలిడేషన్‌ చోటు చేసుకున్నా అది కొత్త చందాదారులను తెచ్చి పెడుతుందని పేర్కొంది. 



ఓ2సీ వ్యాపార విభజనకు అనుమతి: ఆయిల్‌ 2 కెమికల్‌ (ఓ2సీ) విభాగాన్ని ప్రత్యేక వ్యాపారంగా వేరు చేయడానికి షేర్‌హోల్డర్లు, క్రెడిటార్ల అనుమతి లభించిందరి రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ ప్రకటించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాల మేరకు ఓ2సీ వ్యాపార విభజన అంశంపై చర్చించేందుకు ఈక్విటీ వాటాదారులు, లెండర్లు, అన్‌సెక్యూర్డ్‌ క్రెడిటార్ల సమావేశాలు రిలయన్స్‌ నిర్వహించింది. ఈ సమావేశాల్లో 99.99 శాతం వాటాదారులు పాల్గొని తీర్మానానికి అనుకూలంగా ఓటేశారని తెలిపింది.  



ఫ్యూచర్‌ రిటైల్‌కు గడువు పెంపు: కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌, టోకు వ్యాపారాల కొనుగోలుకు కుదిరిన రూ.24,713 కోట్ల ఒప్పందం లాంఛనాలు పూర్తి చేసేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌నకు రిలయన్స్‌ రిటైల్‌ మరో ఆరు నెలలు గడువిచ్చింది. అంటే ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీలోగా లాంఛనాలన్నీ అధికారికంగా పూర్తి చేసేందుకు ఫ్యూచర్‌ రిటైల్‌కు వెసులుబాటు లభిస్తుంది. 


Updated Date - 2021-04-03T06:18:22+05:30 IST