కరోనా పేరుతో సైబర్‌ దాడులు

ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST

‘ప్రభుత్వం ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. మరిన్ని వివరాల కోసం..’ అంటూ మీకు మెయిల్‌ వచ్చిందా? అయితే పొరపాటున కూడా ఆ మెయిల్‌ను ఓపెన్‌ చేయకండి...

కరోనా పేరుతో సైబర్‌ దాడులు

‘ప్రభుత్వం ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. మరిన్ని వివరాల కోసం..’ అంటూ మీకు మెయిల్‌ వచ్చిందా? అయితే పొరపాటున కూడా ఆ మెయిల్‌ను ఓపెన్‌ చేయకండి. ఎందుకంటే సైబర్‌ నేరగాళ్లు పంపిన ఫిషింగ్‌ మెయిల్‌ అది. ఒకవేళ మీరు ఆ వివరాలు తెలుసుకోవాలనే ఆతృతలో ఆ మెయిల్‌ ఓపెన్‌ చేస్తే, మీ ఇన్‌బాక్స్‌లో ఉన్న డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కరోనా భయం పొంచి ఉన్న ఈ సమయంలో పెద్ద సంఖ్యలో సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌’ హెచ్చరిస్తోంది. ncov2019@gov.in  పేరుతో వచ్చే మెయిల్స్‌ను ఓపెన్‌ చేయవద్దని సూచిస్తోంది. ‘ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల్లో ప్రభుత్వం ఉచితంగా కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తోంది’ అంటూ వచ్చే కొన్ని మెయిల్స్‌తో సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ  పేరుతో వచ్చే మెయిల్స్‌ను క్లిక్‌ చేయవద్దు. సైబర్‌ దాడుల బారిన పడకుండా యాంటీ వైరస్‌ టూల్స్‌ ఉపయోగించాలి. అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్‌, లింకులపై క్లిక్‌ చేయకూడదు. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, రివార్డులు, బహుమతుల పేరుతో వచ్చే మెయిల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి.


Updated Date - 2020-06-27T05:30:00+05:30 IST