Abn logo
Oct 27 2021 @ 19:04PM

సైబర్ నేరాల్లో 10శాతం పైగా తెలంగాణకు చెందినవే

హైదరాబాద్: సైబర్ నేరాల కింద నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగిందని, దేశ వ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో 10శాతానికి పైగా కేసులు తెలంగాణ రాష్ట్రంలోనే నమోదైట్టు ఐటీఎస్ డిప్యూ్టీ డైరెక్టర్ జనరల్(అడ్డ్మనిస్ట్రేషన్) జేవీ రెడ్డి వెల్లడించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఏపిఎల్ఎస్ఏ (టీఎస్ అండ్ ఏపీ రాష్ట్రాలు కలిపి) 25 అక్టోబర్ 2021 నుండి 1 నవంబర్ 2021 వరకు విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌ని జరుపుకుంటుంది. వేడుకలలో జె వి రాజా రెడ్డి పాల్లొన్నారు. ప్రజల సాధారణ అవగాహన, భద్రత కోసం మొబైల్ సంబంధిత భద్రతపై ఒక కరపత్రాన్నిఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్‌ క్రైమ్‌ కింద నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు.


మన జనాభాలో దాదాపు 50శాతం మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారని, చైనా తర్వాత ఆన్‌లైన్ వ్యాపారంలో మనం 2వ స్థానంలో ఉన్నామని ఆయన తెలిపారు.అమాయక ప్రజానీకం కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారని అన్నారు. ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నందున మొబైల్ సంబంధిత సెక్యూరిటీ అంశాల గురించి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఓటీపీ మోసాలు, కేవైసీ మోసాలు, క్యూఆర్ కోడ్ మోసాలు, స్మార్ట్‌ ఫోన్ స్మిషింగ్, మొబైల్ టవర్ మోసాలు, నకిలీ కాల్ సెంటర్ మోసాలు, సెక్స్‌టార్షన్ నేరాలు, రుణం,బహుమతి,ఉద్యోగ మోసాలు మొదలైన వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విషయాలను ఈ కరపత్రంలో వివరించినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption