bengaluru: రిటైర్డు dgpకే సైబర్‌ మోసం

ABN , First Publish Date - 2021-10-17T17:46:15+05:30 IST

సైబర్‌ క్రైం మోసాలు పెరిగిపోతున్నాయి. రిటైర్డు డీజీపీ శంకర్‌బిదరి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులోపడి రూ.89 వేలు కోల్పోయా రు. ఈ మేరకు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన బ్యాంకు ఖాతా

bengaluru: రిటైర్డు dgpకే సైబర్‌ మోసం

                - రూ. 89 వేలు గల్లంతు 


బెంగళూరు: సైబర్‌ క్రైం మోసాలు పెరిగిపోతున్నాయి. రిటైర్డు డీజీపీ శంకర్‌బిదరి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులోపడి రూ.89 వేలు కోల్పోయా రు. ఈ మేరకు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచే దోచుకున్నారు. ఫోన్‌చేసిన ఓ వ్యక్తి మీ బ్యాంకు ఖాతాకు పాన్‌కార్డు లింక్‌ అ య్యిందా అని అడిగారు. వెంటనే లింక్‌ చేయాలని లేదా ఖాతా స్తంభింపచేస్తామన్నారు. అంతలోనే మీ ఓటీపీ నెంబరు చెప్పాలని సూచించారు. తెలిపిన కొన్ని నిమిషాలలోనే అకౌంట్‌లో నగదు గల్లంతైంది. ఈ మేరకు శంకర్‌బిదరి ఆగ్నేయవిభాగం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలికాలంలో సైబర్‌ నేరగాళ్లు పాన్‌కార్డుకు బ్యాంకు అకౌంట్‌ లింకు, ఆధార్‌ లింకు చేసుకోవాలని, ఏటీఎం కార్డు గడువు ముగిసిందని బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని మోసాలకు పాల్పడుతున్నారు. 

Updated Date - 2021-10-17T17:46:15+05:30 IST