వికారాబాద్ జిల్లా: కడ్మూరులో భారీ సైబర్ మోసం

ABN , First Publish Date - 2022-01-05T20:45:06+05:30 IST

వికారాబాద్ జిల్లా: లైమ్ కంపెనీ యాప్ ఉచ్చులో పలువురు చిక్కుకున్నారు.

వికారాబాద్ జిల్లా: కడ్మూరులో భారీ సైబర్ మోసం

వికారాబాద్ జిల్లా: లైమ్ కంపెనీ యాప్ ఉచ్చులో పలువురు చిక్కుకున్నారు. వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం, కడ్మూరులో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. కడ్మూరులో వందల సంఖ్యలో జనం సైబర్ మోసం ఉచ్చులోపడి నష్టపోయారు. దాదాపు 2 వందల మంది వాట్సాప్‌లో వచ్చిన లింకులోని యాప్‌తో మోసపోయారు.


లైమ్ కంపెనీ పేరుతో ఓ లింక్‌ను యువకులంతా ఒకరికొకరు షేర్ చేసుకుని యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. యాప్‌లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తున్నాయని నమ్మి దాదాపు 2 వందల మంది పెట్టుబడి పెట్టారు. రూ. 5 వందల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెడితే ప్రతిరోజు ఆదాయం వస్తుందని నమ్మి యాప్‌లో పెట్టుబడి పెట్టారు. సీమా అనే మహిళ వాట్సాప్ చాట్ ద్వారా పెట్టబడి పెట్టించినట్టు బాధితులు చెబుతున్నారు. ‘న్యూ ఇయర్ ఆఫర్’ అంటూ రూ. 10వేలకు లక్ష, లక్షకు 5 లక్షలు అంటూ ఆఫర్ ఇవ్వడంతో ఆ మహిళ మాటలు నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు. మొదట్లో ఆదాయం బాగానే రావడం గమనించి మరింత లాభం వస్తుందనే ఆశతో అప్పు చేసి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొన్ని రోజులు బాగానే డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత యాప్ ద్వారా విత్ డ్రా కావడం ఆగిపోయింది. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు.

Updated Date - 2022-01-05T20:45:06+05:30 IST