Advertisement
Advertisement
Abn logo
Advertisement

Googleలో సైబర్‌ నేరగాళ్లు.. పొరపాటున కూడా ఇలా చేయకండి..!

హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ చేసిన వస్తువు అందకపోవడంతో.. కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఖాతాలోని డబ్బులు పోగొట్టుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. డీఐ రాజు వివరాల ప్రకారం.. కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లి గంగస్థాన్‌కు చెందిన వన్నెంరెడ్డి నాగవెంకటకృష్ణ ట్రాక్‌ ఆన్‌ కొరియర్‌ ద్వారా చెన్నై నుంచి పెయింట్‌ పిగ్మెంట్‌ శాంపిల్స్‌ను ఆర్డర్‌ చేశాడు. పార్శిల్‌ రాకపోవడంతో గూగుల్‌లో కస్టమర్‌కేర్‌ నెంబర్‌ సెర్చ్‌ చేశాడు. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి పోన్‌ పే ద్వారా రూ.2 పంపాడు. ఆ తరువాత తన ఖాతా నుంచి విడుతల వారీగా మొత్తం రూ.94,991 డెబిట్‌ అయినట్లు సందేశం వచ్చింది. మోసపోయానని గ్రహించిన నాగవెంకటకృష్ణ పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement