Abn logo
Mar 6 2021 @ 20:25PM

ఉద్యోగాల పేరుతో సైబర్ మోసం

హైదరాబాద్: నగరంలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అనేక ఉద్యోగాలు ఉన్నాయని సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో ప్రకటనలిచ్చారు. ఈ ప్రకటనను చూసి వారిని ఓ వ్యక్తి సంప్రదించాడు. సైబర్ నేరగాళ్లు  చెప్పిన ప్రకారం వారికి ఉద్యోగం కోసం రూ.50 వేలను బాధితుడు ట్రాన్స్‌ఫర్ చేశాడు. 

అయితే డబ్బులు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. దీంతో తనకు జరిగిన మోసంపై సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు  ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముమ్మరంగా విచారణ చేశారు. ఈ విచారణ ఆధారంగా కలకత్తాకు చెందిన హర్షవర్దన్‌ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుమారు 3వేల మందిని మోసం చేసినట్లు సమాచారం. నిరుద్యోగుల నుంచి కొన్ని కోట్ల రూపాయలను నిందితుడు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.