Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 25 2021 @ 18:54PM

గచ్చిబౌలి చోరీ కేసులో నిందితుల అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈనెల 18న గచ్చిబౌలి టెలికాం నగర్‌లో నివాసం ఉండే గోవింద రావ్ తన ఇంట్లో దోపడీ జరిగిందని ఫిర్యాదు చేసారన్నారు. ఈ దోపడీ కేసును ఛేదించామని సీపీ తెలిపారు. నేపాల్‌కు చెందిన లంక బహదూర్ సాహి, అతని భార్య పవిత్రలను నిందితులుగా గుర్తించామని సీపీ పేర్కొన్నారు. వీరిని సోలాపూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసామన్నారు. నిందితుల వద్ద నుంచి ఏడు లక్షల ఇరవై మూడు వేల రూపాయల నగదుతో పాటు 61 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు.


 ఐదు నెలల క్రితం గోవిందా రావ్ ఇంట్లో పని మనుషులుగా నిందితులు చేరారన్నారు. పనిలో చేరాక నిందితులు ఇద్దరు చాలా నమ్మకంగా వ్యవహరించారన్నారు. ఈ నెల 18న తన ఫ్రెండ్‌తో కలిసి శ్రీశైలం దేవాలయానికి గోవింద రావు వెళ్లారన్నారు. ఆ సమయంలో అతని ఇంట్లో దొంగతనం జరిగిందన్నారు. రెండు రోజుల పాటు తన ఇల్లును చూసుకోవాలని పని మనుషులకు గోవిందరావు చెప్పారని సీపీ వెల్లడించారు. 19వ తేదీ లక్ష్మన్‌కు గోవింద రావు కాల్ చేసారని, అయితే లక్ష్మన్‌ నుంచి  ఎటువంటి రెస్పాండ్ లేదన్నారు. దీంతో అనుమానం వచ్చి తన స్నేహితులను ఇంటికి గోవింద రావ్ పంపాడన్నారు. ఆ సమయంలో స్నేహితులకు అక్కడ సర్వెంట్ ఉండే ఇల్లు ఖాళీగా కనిపించిందన్నారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లో దొంగతనం చేసినట్టు స్నేహితులు గుర్తించారని సీపీ పేర్కొన్నారు. దొంగతనం చేయడానికి ముందు సీసీటీవీ కేమెరా కేబుల్స్‌ను నిందితులు కట్ చేశారన్నారు.19న శ్రీశైలం నుంచి తిరిగి వచ్చాక పోలీసులకు గోవింద్ రావ్ ఫిర్యాదు చేసారని సీపీ తెలిపారు.


నిందితులను పట్టుకోవడానికి నాలుగు టీం లను ఏర్పాటు చేసామన్నారు. తమకు అందిన సమాచారంలో ఎట్టకేలకు ఇద్దరు నిందితులను  సోలాపూర్ రైల్వే స్టేషన్‌‌లో  అరెస్ట్ చేసామని సీపీ తెలిపారు. దొంగతనం అనంతరం నేరుగా నేపాల్‌కు వెళ్లకుండా సోలాపూర్‌లో కొంతకాలం ఉండి ఆపై నేపాల్ వెళ్లాలని నిందితులు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ నిందితులిద్దరిని గోవింద్ దగ్గర యమ్లాల్ అనే వ్యక్తి పనికి కుదిర్చినట్టు తెలుస్తోందన్నారు. యమ్లాల్ అనే వ్యక్తి పాత్రపై కూడా విచారణ చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం నేపాల్‌లో యమ్లాల్ ఉన్నాడని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 


Advertisement
Advertisement