Cyberabad CP స్టీఫెన్‌ రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్..!

ABN , First Publish Date - 2021-09-02T19:39:25+05:30 IST

చర్యలు తప్పవని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించినట్లు...

Cyberabad CP స్టీఫెన్‌ రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్..!

  • తీరు మారకుంటే చర్యలు : సీపీ స్టీఫెన్‌
  • ఎస్‌హెచ్‌వోలతో వర్చువల్‌  సమావేశం 

హైదరాబాద్‌ సిటీ : కష్టపడి పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌లను గుర్తించి రివార్డులతో ప్రోత్సహిస్తామని, లా అండ్‌ ఆర్డర్‌ను నిర్లక్ష్యం చేసినా, పద్ధతి ప్రకారం పనిచేయకపోయినా చర్యలు తప్పవని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించినట్లు సమాచారం. మాదాపూర్‌, బాలానగర్‌, శంషాబాద్‌ జోన్‌ల పరిధిలో కేసులు అత్యధికంగా పెండింగ్‌లో ఉన్న 15 పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలతో బుధవారం సీపీ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ముందుగా పెండింగ్‌లో (అండర్‌ ఇన్వెస్టిగేషన్‌) ఉన్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. అత్యధికంగా కేసులు పెండింగ్‌లో ఉంచిన ఇన్‌స్పెక్టర్‌లను మందలించినట్లు తెలిసింది.


ఆ స్టేషన్లలో పలువురు ఎస్‌హెచ్‌వోల పనితీరు బాగోలేదని, వెంటనే మార్చుకోవాలని చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా కేసుల ఇన్వెస్టిగేషన్‌ జరగాలని, నిందితులకు శిక్షపడేలా చూడాలని సీపీ పేర్కొన్నట్లు సమాచారం. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీలు, 15 పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T19:39:25+05:30 IST