Abn logo
Sep 28 2021 @ 20:33PM

బాలికపై అత్యాచారం.. అబార్షన్.. డాక్టర్ సహా ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్: సైబరాబాద్ కడ్తల్‌లో మైనర్ బాలిక‌పై అత్యాచారం జరిగింది. బాలిక గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించారు. పల్లెచెల్క తాండ‌కు చెందిన రవీందర్‌ను నిందితుడిగా గుర్తించారు. సాగర్ రింగ్‌రోడ్‌లో బాలికకు ఆర్‌ఎంపీ డాక్టర్ రంజిత్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్వహించారు. బాలికకు ఎంబీబీఎస్ డాక్టర్ లక్ష్మీ అబార్షన్ చేశారు. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహం జరిగిన మైనర్ బాలికతో నిందితుడు రవీందర్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అబార్షన్, ప్రెగ్నెన్సీ అక్రమ టెస్టులు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ  డాక్టర్లు డబ్బుల కోసం కక్కుర్తి పడి వైద్య శాఖ పరువు తీశారు. 

ఇవి కూడా చదవండిImage Caption