కొవిడ్ అనంతరం 500% పెరిగిన సైబర్ నేరాలు: సీడీసీ జనరల్

ABN , First Publish Date - 2021-11-12T23:48:22+05:30 IST

కొవిడ్-19 అనంతరం దేశంలో సైబర్ నేరాల రేటు 500 శాతం పెరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. శుక్రవారం 14వ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ

కొవిడ్ అనంతరం 500% పెరిగిన సైబర్ నేరాలు: సీడీసీ జనరల్

న్యూఢిల్లీ: కొవిడ్-19 అనంతరం దేశంలో సైబర్ నేరాల రేటు 500 శాతం పెరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. శుక్రవారం 14వ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా కాలంగా సైబర్ నేరాల పెరుగుదల గురించి అనేక వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే శుక్రవారం జనరల్ రావత్ వెల్లడించిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడాది కాలంలో 500 శాతం సైబర్ నేరాలు పెరగడం తీవ్ర పరిణామాలని అంటున్నారు. డ్రోన్లు, రాన్సంవేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజ్‌లు వంటి వాటితో రాష్ట్రాలు, దేశంపై అనేక బెదిరింపులు రావచ్చని, వాటి నియంత్రణలో అందరం కలిసి పని చేయాలని రావత్ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-11-12T23:48:22+05:30 IST