సైకిల్‌ ప్రయాణం ఆరోగ్యదాయకం

ABN , First Publish Date - 2021-12-09T05:14:04+05:30 IST

రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు కలిసి స్ట్రామ్‌ రైడర్స్‌ పేరిట సైక్లింగ్‌ క్లబ్‌ నెలకొల్పి ప్రజలకు సైక్లింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

సైకిల్‌ ప్రయాణం ఆరోగ్యదాయకం
సైక్లింగ్‌ చేస్తున్న క్లబ్‌ సభ్యులు

 మోతుగూడెం, డిసెంబరు 8: రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు కలిసి స్ట్రామ్‌ రైడర్స్‌ పేరిట సైక్లింగ్‌ క్లబ్‌ నెలకొల్పి ప్రజలకు సైక్లింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. 2016లో నలుగురితో ప్రారంభమైన ఈ సంస్థలో  నేడు 40 మంది సభ్యులున్నారు.  వైద్య నిపుణులు, వ్యాపారస్థులు, విద్యా సంస్థల నిర్వాహకులు, ఇంజనీర్లు ఉన్నారు. ఇప్పటివరకు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఈ క్లబ్‌ కార్యకలాపాలను విస్తరించాలన్న ఆలోచనతో పర్యాటక ప్రదేశాలను కలుపుతూ సుమారు 800 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి సైక్లింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి మారేడుమిల్లి, మోతుగూడెం, డొంకరాయి మీదుగా సీలేరు. చేరుకున్నారు. సీలేరు నుంచి ఒడిసాలోని జయపురం... అక్కడి నుంచి అరకు, లంబసింగి ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ యాత్రను లంబసింగిలో ముగిస్తామని స్ట్రామ్‌ రైడర్స్‌ క్లబ్‌ నిర్వాహకులు రవి, శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2021-12-09T05:14:04+05:30 IST