Abn logo
Sep 27 2021 @ 08:53AM

‘గులాబ్’ తుఫాన్ ఎఫెక్ట్..హైదరాబాద్‎లో భారీ వర్షం

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‎లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‎పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్‎పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్‌ జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్‌, అంబర్‌పేట్, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్‌, మేడిపల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌, దిల్ షుఖ్ నగర్, సరూర్ నగర్ లో ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులకు వరద పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


cyclone gulab: హైదరాబాద్‎లో హై అలర్ట్

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. గులాబ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040-23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


హైదరాబాద్‎తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు రెడ్ అలెర్ట్ ఏరియాలో బడులకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ఇవ్వకపోవడంతో విద్యార్థులను బడికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption