అరేబియా తీరంలో ‘తౌక్టే’ తుఫాన్

ABN , First Publish Date - 2021-05-15T17:53:33+05:30 IST

లక్ష్య దీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం బలపడి శుక్రవారం రాత్రి 11:30 గంటలకు తుఫానుగా మారిందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.

అరేబియా తీరంలో ‘తౌక్టే’ తుఫాన్

హైదరాబాద్: లక్ష్య దీప్ పరిసర ప్రాంతాల్లో  ఏర్పడిన వాయుగుండం బలపడి  శుక్రవారం రాత్రి 11:30 గంటలకు తుఫానుగా మారిందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దీనికి తౌక్టేగా పేరు పెట్టారని ఆమె చెప్పారు. ఈ రోజు ఉదయం 05:30 గంటలకు అమిని దీవికి ఈశాన్య దిశగా 160కీ.మీ. దూరంలో ఉన్నదన్నారు. ఇది మరింత బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా మారి.. తరువాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించనున్నట్టు తెలిపారు. తదుపరి 12 గంటలలో ఇది మరింత బలపడి అతి తీవ్రతుఫానుగా మారి గుజరాత్ తీరాన్ని పోర్బందర్ - నలియాల మధ్య 18వ తేదీ సాయంత్రం 2.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.  


తౌక్టే తుఫాన్ ప్రభావం ఐదు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. మరోవైపు నావికా దళం కూడా రంగంలోకి దిగింది.   

Updated Date - 2021-05-15T17:53:33+05:30 IST