ఎమర్జెంట్‌ అలయన్స్‌కు సైయెంట్‌ మద్దతు

ABN , First Publish Date - 2020-05-21T06:52:05+05:30 IST

కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రాంతీయ, అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లకు పరిష్కారాలను కనుగొనే ప్రక్రియలో తన వంతు సాయం చేయడానికి యూర్‌పనకు చెందిన ఎమర్జెంట్‌ అలయన్స్‌తో...

ఎమర్జెంట్‌ అలయన్స్‌కు సైయెంట్‌ మద్దతు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రాంతీయ, అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లకు పరిష్కారాలను కనుగొనే ప్రక్రియలో తన వంతు సాయం చేయడానికి యూరప్‌కు చెందిన ఎమర్జెంట్‌ అలయన్స్‌తో సైయెంట్‌ చేతులు కలిపింది. అలయన్స్‌లో భాగంగా ప్రపంచంలోని పెద్దపెద్ద సంస్థలు, డేటా నిపుణులు, ప్రభుత్వాలతో సైయెంట్‌ కలిసి పని చేస్తుంది. ఎమర్జెంట్‌ అలయన్స్‌తో కలిసి సైయెంట్‌ డేటాను విశ్లేషిస్తుంది. కరోనా వైరస్‌ తర్వాత వ్యాపారాలు, ప్రజలు కోలుకోవడానికి అవసరమైన సొల్యూషన్లను అభివృద్ధి చేయడంలో సాయం చేస్తుంది. 


Updated Date - 2020-05-21T06:52:05+05:30 IST