బుక్‌చేసిన గంటలోపే సిలిండర్‌ డెలివరీ!

ABN , First Publish Date - 2021-01-14T06:54:23+05:30 IST

గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) శుభవార్త తెలిపింది. బుక్‌చేసుకున్న గంటలోనే (30-45 నిముషాలు) గ్యాస్‌ సిలిండర్‌ ఇంటికి డెలివరీ

బుక్‌చేసిన గంటలోపే సిలిండర్‌ డెలివరీ!

తత్కాల్‌ సర్వీసుల ప్రారంభానికి ఇండియన్‌ ఆయిల్‌ సన్నాహాలు

సింగిల్‌ సిలిండర్‌ వినియోగదారులకు ప్రయోజనం


న్యూఢిల్లీ, జనవరి 13 : గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) శుభవార్త తెలిపింది. బుక్‌చేసుకున్న గంటలోనే (30-45 నిముషాలు) గ్యాస్‌ సిలిండర్‌ ఇంటికి డెలివరీ చేయడానికి తత్కాల్‌ సర్వీసును ప్రారంభించేందుకు ఐఓసీఎల్‌ సన్నాహాలు చేస్తోంది. తత్కాల్‌ సేవలందించే క్రమంలో ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక  ప్రముఖ నగరం లేదా జిల్లాను గుర్తించనున్నారు. ఇలా గుర్తించిన ప్రాంతాల పరిఽధిలోకి వచ్చే సింగిల్‌ సిలిండర్‌ వినియోగదారులకు గ్యాస్‌ బుక్‌చేసుకున్న  30 నుంచి 45 నిముషాల్లో సిలిండర్‌ను అందిస్తామని ఐఓసీఎల్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ సేవలు ఎప్పటి నుంచి అమలవుతాయన్నది  మాత్రం స్పష్టంచేయలేదు. ఇండేన్‌ బ్రాండ్‌ రూపంలో ఇండియన్‌ ఆయిల్‌ ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ సర్వీసులను అందిస్తోంది. కాగా, తత్కాల్‌ సేవతో సింగిల్‌ సిలిండర్‌ వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.

Updated Date - 2021-01-14T06:54:23+05:30 IST