Abn logo
Sep 25 2021 @ 18:55PM

ఓటుకు 2వేలు ఇస్తారు.. తెల్లారితే సిలిండర్‌ ధర పెంచుతారు: హరీష్‌రావు

హుజూరాబాద్‌: బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే సిలిండర్‌ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూల్‌ చేస్తారని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని, మంచి నూనె ధర 300 రూపాయలకు పెంచుతారన్నారు.  పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల బాధను తమ బాధగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కట్టుకునేందుకు డబ్బులు ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని బలపర్చలని కోరారు. మాయ మాటలు చెప్పే వారి వైపు ఉంటారా.. న్యాయం, ధర్మం వైపు ఉంటారా అని హరీష్‌రావు ప్రశ్నించారు. 

ఇవి కూడా చదవండిImage Caption