Abn logo
May 30 2020 @ 11:36AM

టూరిస్టుల హాలిడే ఖర్చులు మేమే చెల్లిస్తాం: సైప్రస్

నికోసియా: టూరింగ్ ‌కోసం తమ దేశానికి వచ్చి కరోనా బారిన పడిన పర్యాటకులకు హాలిడే ఖర్చులు మొత్తం తామే భరిస్తామని సైప్రస్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పేషెంట్లు, వారి కుటుంబాలకు వసతి, వైద్య, ఆహారం తదితర ఖర్చులను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ మధ్యదరా సముద్ర ద్వీప దేశం వెల్లడించింది. టూరిస్టులు కేవలం విమానాశ్రయం వరకు వెళ్లేందుకు అవసరమయ్యే ప్రయాణ ఖర్చులు, విమానంలో స్వదేశానికి వెళ్లేందుకు అవసరమయ్యే ఖర్చులు మాత్రం పర్యాటకులే భరించాల్సి ఉంటుందని సైరస్ పేర్కొంది. కాగా సైప్రస్‌లో ఇప్పటి వరకు 942 మంది కొవిడ్-19 బారిన పడగా.. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 784 మంది ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించి కోలుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement