డీమార్ట్‌ షేర్లు... సందిగ్ధత...

ABN , First Publish Date - 2021-10-20T00:45:04+05:30 IST

డీమార్ట్ షేర్లను అమ్మేయాలా ? కొనాలా ? కొనసాగించాలా ? సంబంధిత షేర్‌హోల్డర్లను ప్రస్తుతం వేధిస్తోన్న సందేహాలివి.

డీమార్ట్‌ షేర్లు... సందిగ్ధత...

హైదరాబాద్ : డీమార్ట్ షేర్లను అమ్మేయాలా ? కొనాలా ? కొనసాగించాలా ? సంబంధిత షేర్‌హోల్డర్లను ప్రస్తుతం వేధిస్తోన్న సందేహాలివి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (డీమార్ట్‌‌) షేర్‌ ప్రైస్‌, ఈ రోజు సెషన్‌లో ప్రారంభంలోనే దాదాపు 11 % పెరిగి, 52 వారాల గరిష్ట స్థాయి (రూ. 5,900)ను తాకింది. ది. రెండో త్రైమాసికంలో రూ. 418 కోట్ల పీఏటీను కంపెనీ నివేదించింది. ఏడాది క్రితమున్న రూ. 199 కోట్లతో పోలిస్తే ఇది 110 % పెరిగింది.  గత త్రైమాసికంలోని రూ. 95.36 కోట్లతో పోలిస్తే లాభం గణనీయంగా పెరిగింది. ఏకీకృత ఆదాయం రూ. 7,789 కోట్లకు చేరింది. 

Updated Date - 2021-10-20T00:45:04+05:30 IST