డి-28 ఎడమ కాలువకు గండ్లు చేసిన దుండగులు

ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST

సరస్వతి కెనాల్‌ 28 పల్కెరువాగు ఎడమకాలువ 2వ కిలో మీటర్‌ వద్ద మందపల్లి గ్రామస్థులు పగలగొట్టారని పెంబి రైతులు అన్నారు.

డి-28 ఎడమ కాలువకు గండ్లు చేసిన దుండగులు
కాలువ గండ్లను చూపిస్తున్న రైతులు

అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతుల డిమాండ్‌

పెంబి, ఏప్రిల్‌ 13 : సరస్వతి కెనాల్‌ 28 పల్కెరువాగు ఎడమకాలువ 2వ కిలో మీటర్‌ వద్ద మందపల్లి గ్రామస్థులు పగలగొట్టారని పెంబి రైతులు అన్నారు. వెంటనే అధికారులు డి-28 కెనాల్‌ ద్వారా పెంబి ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ రోజు కూడా ఆయకట్టు నీరు అందినట్లు దాఖలాలు లేవని, పెంబి రైతులుకాలువ వెంట ఎన్నిసార్లు గండ్లను పూడుస్తూ వచ్చినప్పటికీ తిరిగి వెను వెంటనే గండ్లను తెరిచి నీటిని వృధాగా వాగులోకి వదులుతున్నారని, దీని మూలంగా పెంబి రైతులు పంటపొలాలకు నీరు అందక, భూములు బీడుగా మారుతున్నాయి. పశువులకు నీరుసమస్య తీవ్రంగా ఉందని, అధికారులు, నాయ కులు ఎన్నిసార్లు విన్నవించినా తగినచర్యలు తీసుకోవడం లేదని, కనీసం ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించి కాలువకు గండ్లు ఏర్పరిచిన వారిపై తగిన చర్యలు తీసుకొని కాలువకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని పెంబి గ్రామరైతులు కోరుతున్నారు. రైతులు తులాల రాజలింగు, పాకాల భూమా రెడ్డి, కన్నె మల్లేష్‌, జనార్ధన్‌, కృష్ణారెడ్డి, నారాయణగౌడ్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-04-13T05:30:00+05:30 IST