Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగులకు త్వరలో డీఏ

సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు

టీజీవో అధ్యక్షురాలు మమత


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం త్వరలో డీఏను (కరువు భత్యం) ప్రకటించనుందని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల(టీజీవో) సంఘం అధ్యక్షురాలు వి.మమత తెలిపారు. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారాయణ తదితరులు గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.


ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏల గురించి సీఎంకు వివరించగా.. త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలను కలుపుకొని భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా ఉద్యోగులు సహకరించాలని సీఎం కోరినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement