ఎరువు ‘బరువు’

ABN , First Publish Date - 2021-10-12T06:56:25+05:30 IST

సామర్లకోట, అక్టోబరు 11: కొద్ది నెలలుగా పెరుగుతున్న ఎరువుల ధరలు రైతులకు బరువుగా మారాయి. గతంలో సీజన్‌కు లేదా రెండు సీజన్లకు ఒకసారి ఈ ధరలు పెరిగేవి. అయితే గత రెండు నెలల కిందట ప్రభుత్వ నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు పెరుగుదలతోపాటు, ఇటు రవాణా చార్జీ ల భారం వల్ల ధరలు పెంచకతప్పడం లేదని ఎరువుల డీలర్లు చెబు

ఎరువు ‘బరువు’

పెరిగిన డీఏపీ, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు 

జిల్లా రైతులపై రూ. 8 కోట్లపైనే భారం

సామర్లకోట, అక్టోబరు 11: కొద్ది నెలలుగా పెరుగుతున్న ఎరువుల ధరలు రైతులకు బరువుగా మారాయి. గతంలో సీజన్‌కు లేదా రెండు సీజన్లకు ఒకసారి ఈ ధరలు పెరిగేవి. అయితే గత రెండు నెలల కిందట ప్రభుత్వ నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు పెరుగుదలతోపాటు, ఇటు రవాణా చార్జీ ల భారం వల్ల ధరలు పెంచకతప్పడం లేదని ఎరువుల డీలర్లు చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ధరలు పెరుగుతుండడంతో రైతన్నల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 5,56,757.76 ఎక రాల్లో సాగు పూర్తికాగా, మిగిలిన పంటలు మరో 31, 946.98 ఎకరాల్లో సాగవుతున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులు వినియోగిస్తున్నారు. వీటిలో 90 వేల మెట్రిక్‌టన్నుల యూరియా, మరో 45వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 15 వేల మెట్రిక్‌ టన్నుల పొటాష్‌, తది తర సూపర్‌, కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగిస్తున్నారు. వీటిలో డీఏపీ, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరి గాయి. ప్రస్తుతం డీఏపీ బస్తా గతంలో రూ.1200 ఉం డగా నేడు రూ.1700కు పెరిగింది. పొటాష్‌ రూ.1040 నుంచి రూ.1600కు పెరిగింది. కాంప్లెక్స్‌ రూ.1550 నుంచి రూ.1700కు పెరి గింది. వీటి పెరుగుదలతో జిల్లాలో రైతులపై అదనం గా రూ.8 కోట్లకు పైబడి మోయలేని భారం పడ నుంది.


రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను పంపి ణీ చేస్తోంది. అక్కడ అన్ని రకాల ఎరువుల లభ్యం కాకపోవడంతో రైతులు తిరిగి ప్రైవేట్‌ డీలర్లను ఆశ్రయించాల్సివస్తోంది. డీఏపీ ఉత్పత్తి తగ్గిందని కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారులు కొందరు బస్తా రూ.150 నుంచి రూ.175 వరకూ అదనంగా వేసి అమ్మకాలు జరి పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా పూర్తిస్థాయిలో ఎరువులు దొరకని పరిస్ధితి నెలకొంది. పెదబ్రహ్మదేవం గ్రామ రైతు బండారు వెం కట సత్యనారాయణ మాట్లాడుతూ ఒక్క కాంప్లెక్స్‌ ఎరువుల ధర బస్తాకే రూ.300కు పైబడి రైతుపై భారం పడిందని ఆయన వాపోయారు.


ఎరువు        మార్చి     అక్టోబరు


20-20-0-13   రూ.950   రూ.1300


14-35-14     రూ.1275   రూ.1700


28-28        రూ.1275   రూ.1700


10-26        రూ.1175   రూ.1650


16-20         రూ.900   రూ.1250


పొటాష్‌        రూ.875   రూ.1600


గ్రో 65 ప్లస్‌    రూ.1250   రూ.1800 

Updated Date - 2021-10-12T06:56:25+05:30 IST