Abn logo
Feb 23 2021 @ 02:02AM

ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్య!

  • ముంబై హోటల్‌లో మృతదేహం.. ఆ పక్కనే సూసైడ్‌ నోట్‌
  • దాద్రానగర్‌ హవేలీ నుంచి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నిక

ముంబై, ఫిబ్రవరి 22: లోక్‌సభ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ (58) ముంబైలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాద్రానగర్‌ హవేలీ పార్లమెంట్‌ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మృతదేహం వద్ద ఓ సూసైడ్‌ నోట్‌ను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. దేల్కర్‌ మృతికి కారణం ఏమిటన్నది పోస్టుమార్టం అనంతరమే తెలుస్తుందని వివరించారు. దేల్కర్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. సిల్వస్సాలో కార్మిక సంఘం నేతగా ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. గిరిజనుల హక్కుల కోసం పోరు సల్పారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్‌ నామినీగా దాద్రానగర్‌ హవేలీ స్థానం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా ఆరుసార్లు ఎంపీ అయ్యారు. 2009, 2014లో ఓటమి అనంతరం కాంగ్రె్‌సను వీడారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 

Advertisement
Advertisement
Advertisement