రోజుకు రెండు లక్షల కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2021-12-30T02:11:41+05:30 IST

మంగళవారం ఫ్రాన్స్‌లో 1,80,000 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు యూరోపియన్ హెల్త్ మినిస్టర్ ఒలీవర్ వెరన్ తెలిపారు. ఇప్పటికే బ్రిటన్ సహా అనేక యూరప్ దేశాలు కొవిడ్ ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫ్రాన్స్ తాజా కేసులు యూరప్‌ను మరింత భయపెడుతున్నాయి..

రోజుకు రెండు లక్షల కొవిడ్ కేసులు

పారిస్: కొవిడ్-19 మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచాన్ని కుదిపివేసిన కొవిడ్ తాజాగా మరోమారు విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా ఫ్రాన్స్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. ఫ్రాన్స్‌లో రోజుకు రెండు లక్షల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. 2 లక్షల కేసులు ఫ్రాన్స్‌లో వరుసగా మూడో రోజు నమోదు అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఫ్రాన్స్‌లో 1,80,000 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు యూరోపియన్ హెల్త్ మినిస్టర్ ఒలీవర్ వెరన్ తెలిపారు. ఇప్పటికే బ్రిటన్ సహా అనేక యూరప్ దేశాలు కొవిడ్ ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫ్రాన్స్ తాజా కేసులు యూరప్‌ను మరింత భయపెడుతున్నాయి. ఇక బ్రిటన్‌లోనూ ఇదే తరహాలో కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ రోజుకు లక్ష కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

Updated Date - 2021-12-30T02:11:41+05:30 IST