హాలోగ్రామ్‌ స్టిక్కర్ల మార్పుపై నిత్యం తనిఖీలు

ABN , First Publish Date - 2021-03-06T05:58:32+05:30 IST

‘జిల్లాలో పాత బిల్లుల హాలోగ్రామ్‌ స్టిక్కర్లను మార్పు చేసి డూప్లికేట్‌ బిల్లులు తయారు చేసి ఇసుక రవాణా చేస్తున్న విషయంలో భూగర్భ గనులు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలతో పాటు పోలీసు యంత్రాంగం, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థ, వారి నిఘా విభాగాలు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఏ ర్యాంపునుంచైనా డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక తీయడానికి ప్రయత్నిస్తే చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి’ అని జిల్లా ఇసుక సరఫరా అధికారి తెలిపారు.

హాలోగ్రామ్‌ స్టిక్కర్ల మార్పుపై నిత్యం తనిఖీలు

  • రోజుకి 11,500 మెట్రిక్‌ టన్నుల ఇసుక తీస్తున్నాం
  • బల్క్‌ ఆర్డర్లు, డోర్‌ డెలివరీ  కేటాయింపుల్లో ఎవరి జోక్యం లేదు
  • 8 ‘మళ్లీ ఇసుక దోపిడీ’ కథనానికి డీఎస్‌వో వివరణ

రాజమహేంద్రవరం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో పాత బిల్లుల హాలోగ్రామ్‌ స్టిక్కర్లను మార్పు చేసి డూప్లికేట్‌ బిల్లులు తయారు చేసి ఇసుక రవాణా చేస్తున్న విషయంలో  భూగర్భ గనులు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలతో పాటు పోలీసు యంత్రాంగం, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థ, వారి నిఘా విభాగాలు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఏ ర్యాంపునుంచైనా డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక తీయడానికి ప్రయత్నిస్తే చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి’ అని జిల్లా ఇసుక సరఫరా అధికారి తెలిపారు. ‘మళ్లీ ఇసుక దోపిడీ’ శీర్షికతో శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తకు ఆయన వివరణ ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ర్యాంపుల నుంచి ప్రతీరోజూ సుమారు 11,500 మెట్రిక్‌ టన్నుల ఇసుక తీస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో సెమీ మిషనరీతో ఇసుక లోడింగ్‌కు అనుమతులు మంజూరు చేయడం వల్ల  ఎక్కువ మోతాదులో ఇసుక తీస్తున్నామన్నారు. ప్రస్తుతం నిత్యం 10 వేల నుంచి 20 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక ఆనలైన బుకింగ్‌ జరుగుతోందని, ఇలా బుక్‌ అయిన ఆర్డర్లను లారీ సహా బేరీజు వేసుకుని, వినియోగదారుల బుకింగ్‌ ప్రకారం రవాణా చార్జీలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. జిల్లాలో వివిధ ర్యాంపులకు ఎలాట్‌మెంట్లు ఇస్తున్నామని, ఇందులో ఎవరి జోక్యం ఉండదన్నారు. బల్క్‌ ఆర్డర్‌ విషయంలో వినియోగదారుల సమ్మతితోనే మార్పులు జరుగుతున్నాయన్నారు. కోనసీమలో కూడా సంబంధిత శాఖల అధికారులు కొన్ని రోజులుగా తనిఖీలను ముమ్మరం చేశారన్నారు. జిల్లాలో ఏ విధమైన అవకతవకలు జరుగుతున్నట్టు తెలిసినా స్పష్టమైన ఆధారాలతో సంబంఽధిత అధికారులకు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2021-03-06T05:58:32+05:30 IST