Aug 3 2021 @ 00:33AM

దాక్కో దాక్కో మేక... పులొచ్చి కొరుకుద్ది పీక!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఇందులోని తొలి పాట ‘దాక్కో దాక్కో మేక... పులొచ్చి కొరుకుద్ది పీక’ను ఈ నెల 13న విడుదల చేయనున్నారు. సోమవారం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం వెల్లడిస్తూ... టీజర్‌ విడుదల చేశారు. అందులో గాయకులు, దేవిశ్రీ కనిపించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ వ్యయంతో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పాటను సైతం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ పాటను తెలుగులో శివమ్‌, హిందీలో విశాల్‌ దడ్లాని, కన్నడలో విజయ్‌ ప్రకాశ్‌, మలయాళంలో రాహుల్‌ నంబియార్‌, తమిళంలో బెన్నీ దయాల్‌ పాడారు. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా సినిమా విడుదల కానుంది.