దాల్‌ మఖాని

ABN , First Publish Date - 2021-08-14T17:53:09+05:30 IST

చిరోంజి దాల్‌ - 50గ్రాములు, టొమాటో ప్యూరీ - అరకప్పు, క్రీమ్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి

దాల్‌ మఖాని

కావలసినవి: చిరోంజి దాల్‌ - 50గ్రాములు, టొమాటో ప్యూరీ - అరకప్పు, క్రీమ్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - ఒకటి, అల్లంపేస్టు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, బేకింగ్‌సోడా - చిటికెడు, గరం మసాల - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా కుక్కర్‌లో చిరోంజి దాల్‌ వేసి, కొద్దిగా ఉప్పు, అర టీస్పూన్‌ కారం, అల్లం పేస్టు, ఇంగువ, బేకింగ్‌ సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి వేయాలి. టొమాటో ప్యూరీ వేసి కలుపుకోవాలి. కాసేపు ఉడికిన తరువాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మిగిలిన కారం వేయాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చిరోంజి దాల్‌ వేసి కలుపుకోవాలి. ఉడుకుతున్న సమయంలో గరంమసాల వేయాలి. అర టేబుల్‌స్పూన్‌ క్రీమ్‌ వేసి మరికాసేపు ఉడికించాలి. స్టవ్‌పై నుంచి దింపిన తరువాత మిగిలిన క్రీమ్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-08-14T17:53:09+05:30 IST