దాల్‌ మఖాని

ABN , First Publish Date - 2021-05-22T19:30:33+05:30 IST

మినుములు, పెసలు, శనగలు, కందులు.. వీటిలో ప్రొటీన్లు పుష్కలం. రోజూ వీటిని ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. అయితే కాస్త కొత్త రుచులను ఆస్వాదించాలంటే ఇదిగో ఈ రెసిపీలను ట్రై చేయండి.

దాల్‌ మఖాని

పప్పులతో సరికొత్త రుచులు

మినుములు, పెసలు, శనగలు, కందులు.. వీటిలో ప్రొటీన్లు పుష్కలం. రోజూ వీటిని ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. అయితే కాస్త కొత్త రుచులను ఆస్వాదించాలంటే ఇదిగో ఈ రెసిపీలను ట్రై చేయండి. మినుములతో చేసే కబాబ్స్‌, పెసలతో చేసే ఢోక్లా, దాల్‌ మఖానీ మీ జిహ్వ చాపల్యాన్ని తీరుస్తాయి. 


పోషక విలువలు(100గ్రాములకు)

మినుముల్లో 

క్యాలరీలు  - 364

ప్రొటీన్లు  - 19గ్రా

కార్బోహైడ్రేట్లు  - 61గ్రా


పెసర్లలో...

క్యాలరీలు  - 347

ప్రొటీన్లు  - 24గ్రా

కార్బోహైడ్రేట్లు  - 63గ్రా


శనగలలో....

క్యాలరీలు  - 378

ప్రొటీన్లు  - 20గ్రా

కార్బోహైడ్రేట్లు  - 63గ్రా


కందులలో...

క్యాలరీలు  - 300

ప్రొటీన్లు  - 20గ్రా

కార్బోహైడ్రేట్లు  - 50గ్రా


కావలసినవి: నల్ల మినప్పప్పు - రెండు  కప్పులు, అల్లం - చిన్నముక్క, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - ఒకటేబుల్‌స్పూన్‌, షాజీర - రెండు టీస్పూన్లు, మెంతులు - ఒక టీస్పూన్‌, టొమాటో ప్యూరీ - రెండు  కప్పులు, కారం - ఒక టీస్పూన్‌, పంచదార - ఒక టీస్పూన్‌, క్రీమ్‌ - అరకప్పు, పచ్చిమిర్చి - నాలుగైదు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: ముందుగా కుక్కర్‌లో పప్పు వేసి, కొద్దిగా ఉప్పు, అల్లం ముక్క వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా వేడి  అయ్యాక వెన్న వేయాలి. తరువాత నూనె వేయాలి. కాస్త వేడి అయ్యాక షాజీర, మెంతులు వేసి వేగించాలి. తరువాత టొమాటో ప్యూరీ వేయాలి. కారం, పంచదార, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి. చిన్నమంటపై నూనె విడిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు వేయాలి. పప్పు మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. చివరగా పచ్చిమిర్చితో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-05-22T19:30:33+05:30 IST