బిపిన్ రావత్ మృతిపై దలైలామా దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-12-09T18:41:22+05:30 IST

ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన దుర్ఘ‌ట‌న‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మృతికి బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బిపిన్ రావత్ మృతిపై దలైలామా దిగ్భ్రాంతి

ఇంటర్నెట్ డెస్క్: ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన దుర్ఘ‌ట‌న‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మృతికి బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావ‌త్ కుటుంబ‌స‌భ్యులతో పాటు ఆ ప్ర‌మాదంలో చ‌నిపోయిన ఇతర సైనికుల కుటుంబాలకు కూడా ఆయన సంతాపం తెలియజేశారు. 


జనరల్ బిపిన్‌ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌ సహా 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమిళనాడులోని సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి వెల్లింగ్టన్‌ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ఎంఐ 17 వీ5 హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-09T18:41:22+05:30 IST