దగా చేసిన ‘దలాల్‌’ స్ట్రీట్‌

ABN , First Publish Date - 2020-04-01T06:23:40+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ మదుపరులకు మంగళవారంతో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరం చుక్కలు చూపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2019-20 ఆర్థిక సంవ త్సరంలో...

దగా చేసిన ‘దలాల్‌’ స్ట్రీట్‌

రూ.37.59 లక్షల కోట్లు హాంఫట్‌

2019-20లో 26 శాతం నష్టపోయిన సూచీలు


ముంబై: స్టాక్‌ మార్కెట్‌ మదుపరులకు మంగళవారంతో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరం చుక్కలు చూపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2019-20 ఆర్థిక సంవ త్సరంలో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ క్యాపి టలైజేషన్‌ రూ.37.59 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది, మార్చి నాటికి రూ.151 లక్షల కోట్లున్న మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌, మంగళవారం నాడు రూ.113 లక్షల కోట్లకు పడిపోయింది. ఇదేకాలంలో సెన్సెక్స్‌ 9,204.42 పాయింట్లు (23.80 శాతం), నిఫ్టీ 3,026.15 పాయింట్లు (26.03 శాతం) నష్టపోయాయి. కాగా ఆర్థిక సంవత్సరం చివరి నెలలో కరోనా వైరస్‌ భయాలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను వెంటాడాయి. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో సెన్సెక్స్‌ ఏకంగా 28.57 శా తం, నిఫ్టీ 29.34 శాతం నష్టపోయాయి. 


ఆఖరి రోజున లాభాలతో ముగింపు: ఆర్థిక సంవత్సరం చివరి రోజు మంగళవారం నాడు మాత్రం రిలీఫ్‌ ర్యాలీతో స్టాక్‌ మార్కెట్‌ కొద్దిగా కోలుకుంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మదుపరులు కొనుగోళ్లకు దిగారు. దీంతో సెన్సెక్స్‌ 1,028.17 పాయింట్ల లాభంతో 29,468.49 దగ్గర ముగియగా, 316.65 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8,597.75 వద్ద క్లోజైంది. 

Updated Date - 2020-04-01T06:23:40+05:30 IST