దళిత కుటుంబాల్లో మార్పు కోసమే ‘దళిత బంధు’: మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-25T04:09:07+05:30 IST

దళిత కుటంబాల్లో మార్పు తేవడం కోసమే రాష్ట్ర ప్రభు త్వం దళితబంధు పథకం చేపట్టిందని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి అ న్నారు.

దళిత కుటుంబాల్లో మార్పు కోసమే ‘దళిత బంధు’: మంత్రి నిరంజన్‌రెడ్డి
కాలనీలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి

గోపాల్‌పేట, జూలై 24:దళిత కుటంబాల్లో మార్పు తేవడం కోసమే రాష్ట్ర ప్రభు త్వం దళితబంధు పథకం చేపట్టిందని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి అ న్నారు.  పల్లెనిద్రలో భాగంగా శుక్రవారం రాత్రి గోపాల్‌పేట మండల కేంద్రంలో బస చేశారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ వారి స మస్యలను తెలుసుకోడమే పల్లెనిద్ర ముఖ్య ఉద్దేశ్యమని  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ఏడేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. అనంత రం బసచేశారు. శనివారం ఉదయం పలు కాలనీలలో మంత్రి పర్యటించారు.  కాల నీ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఏవైనా సమస్యలు ఉన్నాయా అని తెలు సుకున్నారు. అయోధ్యనగర్‌ కాలనీలో మురుగుకాలువలు, కరెంటు, రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు మంత్రికి వివరించారు.  వచ్చే నిధులతో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాసులు, ఎంపీపీ సంధ్యా, జడ్పీటీసీ భార్గవి, ఎంిపీటీసీ సభ్యురాలు, కేతమ్మ, కోఆప్షన్‌సభ్యులు మతీన్‌, ఎంిపీడీవో కరుణశ్రీ, తహిసీల్దార్‌ నరేందర్‌, టీఆర్‌ఎస్‌  జిల్లా మహిళా నా యకురాలు ప్రమీల, శశికళ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాలరాజు, రైతు సమ న్వయ సమితి మండల అధ్యక్షుడు తిరుపతియాదవ్‌, నాయకులు, కొత్తరామారావు, కోటీశ్వర్‌రెడ్డి, కాశీనాథ్‌, మన్నెం నాయక్‌, గాజుల కోదండం పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T04:09:07+05:30 IST