Abn logo
Sep 20 2021 @ 20:22PM

అర్హులైన అన్ని కుటుంబాలకు ‘దళితబంధు’: హరీశ్‌రావు

కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన  దళితబంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికీ అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దళితబంధుపై  క్లస్టర్‌ అధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందవవద్దని తెలిపారు. కొత్తగా వివాహమయిన వారికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. దళితబంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలని కోరారు. దళితబంధు పథకం కింద వచ్చే 10 లక్షలతో నాలుగు యూనిట్లు కూడా స్థాపించుకోవచ్చని మంత్రి తెలిపారు. దళితబంధు ఖాతాలు తెరిచేటప్పుడు తప్పిదాలు జరుగకుండా చూసుకోవాలని హరీశ్‌రావు బ్యాంకర్లను ఆదేశించారు. 

ఇవి కూడా చదవండిImage Caption