Advertisement
Advertisement
Abn logo
Advertisement

మృతదేహంతో దళితుల ధర్నా

అనంతపురం: తమకు స్మశాన స్థలం చూపించాలని డిమాండ్ చేస్తూ.. లేపాక్షిలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం మృతదేహంతో దళితులు ధర్నా చేశారు. కొండూరు గ్రామం నుంచి మృతదేహాన్ని లేపాక్షి మండల కేంద్రానికి తీసుకొచ్చారు. మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారి మధ్య తోపులాట జరిగింది.


అనంతరం తహసీల్దారు కార్యాలయం ఎదుట మృతదేహంతో బైఠాయించారు. వారు మాట్లాడుతూ లేపాక్షి మండలం కొండూరులో స్మశాన వాటిక స్థలాన్ని స్థానిక వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి పేరుతో రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారని, దీంతో అంత్యక్రియలకు దళితులు వెళ్లకుండా సదరు నేత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చనిపోయిన వారిని ఎక్కడ ఖననం చేయాలని ప్రశ్నించారు. స్మశాన స్థాలనికి పట్టా ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేసే వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించుకున్నారు.

Advertisement
Advertisement