ఏడేళ్ల పాలనలో కేసీఆర్‌కు దళితులు గుర్తుకు రాలేదా?: ఆర్ఎస్పీ

ABN , First Publish Date - 2021-08-29T01:34:41+05:30 IST

కరీంనగర్‌ పర్యటనలో దళితుల కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, గత ఏడేళ్ల పాలనలో

ఏడేళ్ల పాలనలో కేసీఆర్‌కు దళితులు గుర్తుకు రాలేదా?: ఆర్ఎస్పీ

ఆదిలాబాద్‌: కరీంనగర్‌ పర్యటనలో దళితుల కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, గత ఏడేళ్ల పాలనలో దళితులకు ఏమి చేశారో చెప్పాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో గెలవడానికే ప్రతీ ఇంటికి గొర్రెలు, బర్రెలు ఇచ్చి అందరినీ బక్రాలు చేస్తున్నారని తెలిపారు. ఎంతో కష్టపడి అటవీ భూముల్లో సాగు చేసుకుంటన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆగమేఘాల మీద మంత్రి మల్లారెడ్డికి యూనివర్సిటీని అప్పగించారని ప్రవీణ్‌కుమార్‌ మండిపడ్డారు. 

Updated Date - 2021-08-29T01:34:41+05:30 IST