పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధు

ABN , First Publish Date - 2022-01-23T03:46:08+05:30 IST

రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపెట్టిందని రాష్ట్ర షెడ్యూల్డ్‌కులాల సంక్షే మశాఖ మంత్రి కొప్పులఈశ్వర్‌ అన్నారు.

పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ఆసిఫాబాద్‌, జనవరి 22: రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపెట్టిందని రాష్ట్ర షెడ్యూల్డ్‌కులాల సంక్షే మశాఖ మంత్రి కొప్పులఈశ్వర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లా నుంచి షెడ్యూల్డ్‌ కులాల కార్పొరేషన్‌ చైర్మన్‌ బండారి శ్రీని వాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అన్ని జిల్లాల కలె క్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. దళితులు అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈక్రమంలో ఇటీవల జరిగిన క్యాబి నెట్‌ సమావేశంలో దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 118నియోజక వర్గాల్లో మొదటి దశలో నియోజక వర్గానికి 100మంది చొప్పున లబ్ధి దారులను ఎంపిక చేసి దళిత బంధు పథకం అమలు చేస్తామని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికా రులు సమావేశాలు నిర్వహించి ఫిబ్రవరి 5లోగా అర్హులైన లబ్ధి దారుల జాబితా సిద్ధం చేసి అందిం చాలని సూచించారు. మార్చి 7లోగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని, ఇందులో నుంచి రూ.10వేలను లబ్ధిదారు లకు రక్షణ నిధిగా జమ చేస్తామని తెలిపారు. దళిత బంధు పథకం అమలుకు రూ.100 కోట్లు విడుదల చేసి అన్ని జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T03:46:08+05:30 IST