‘రాజాసింగ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి’

ABN , First Publish Date - 2021-03-02T13:38:01+05:30 IST

మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే

‘రాజాసింగ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి’

హైదరాబాద్/రాంనగర్‌ : మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం విద్యానగర్‌లోని సంఘం కార్యాలయంలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా మాదిగ అమరవీరులకు నివాళులర్పించిన వంగపల్లి శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు పొన్నాల యాదయ్య, రమే్‌షమాదిగ, బంగారి శ్రీనివాస్‌, కె.వెంకట్‌, రాహుల్‌, తిరుమలేష్‌, శ్రీకాంత్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


మాదిగ అమరవీరులకు ఎమ్మార్పీఎస్‌ నివాళి

సరూర్‌నగర్‌ : మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని బాలాపూర్‌ చౌరస్తాలో సోమవారం మాదిగ అమరవీరులకు ఎమ్మార్పీఎస్‌ ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. వర్గీకరణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న మాదిగలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి బాబుమాదిగ, బొర్ర రవి, చాగంటి పుల్లయ్య, తొట్ల శ్రీను, ఆనందం, పరమేశ్‌, అంజన్న, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. 


మన్సూరాబాద్‌: ఎమ్మార్పీఎస్‌ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన సుధాకర్‌ మాదిగ ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్‌లో నిర్వహించిన నాయకులు గగిరి, రాజు, సురేష్‌, హుస్సేన్‌, నరసింహ, శేఖర్‌, అశోక్‌ పాల్గొన్నారు.

-  జైపురి కాలనీలో డివిజన్‌ అధ్యక్షుడు పిల్లాయిపల్లి మహేశ్‌మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వేముల సూర్యప్రకాశ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.


దళిత బహుజన సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌ 

హయత్‌నగర్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం దళిత బహుజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హయత్‌నగర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కనకయ్య, ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి సుధాకర్‌, జెనిగే విష్ణువర్ధన్‌, రాజ్‌కుమార్‌, నర్సింగ్‌రావు, వెంకటేష్‌, రమేష్‌ తదితరుతు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T13:38:01+05:30 IST