Abn logo
Oct 21 2021 @ 19:40PM

దళితబంధు కేసీఆర్‌ మాయ: విజయశాంతి

హుజూరాబాద్‌: దళితబంధు పథకం సీఎం కేసీఆర్‌ మాయ అని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే చెత్త సీఎం కేసీఆర్‌ అని ఓ సర్వేలో తేలిందని తెలిపారు. తెలంగాణ ద్రోహులను నెత్తిన పెట్టుకొని, ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులను నడి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దన్నారు. అవసరం ఉన్నంత వరకు నాయకులను వాడుకొని వదిలేయడం ఆయనకు అలవాటేనని దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరుసార్లు గెలిచారనిని, పనిచేసే నాయకులను ప్రజల గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. ఏడోసారి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలు చూస్తున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేసీఆర్‌ అబద్ధాల మాటలను నమ్మే స్థితిలో లేరని విజయశాంతి అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...